Telangana Gig and Platform Workers Union

TGPWU firmly opposes deactivation of workers’ IDs


December 19, 2024: Members of the Telangana Gig and Platform Workers’ Union (TGPWU), volunteers and saathis resolved to fight against deactivation of workers’ IDs and other unfair practices of platform companies. This resolution was passed at a memorial meeting held in memory of Chandrika, an Urban Company worker who passed away on November 15, 2024, allegedly due to stress-induced health complications. The meeting honoured Chandrika as a fearless comrade and TGPWU’s women’s wing leader who fought relentlessly for herself and all other Urban Company workers whose IDs had been arbitrarily blocked by the platform. Her determination to not step down despite harassment by the platform and by the police is an inspiration not just to other Urban Company workers but also to all those workers fighting against exploitation and algorithmic control in India’s gig and platform economy. TGPWU stands steadfast in its commitment to advance Chandrika’s struggle and to ensure justice for all our fellow workers who are crushed by dehumanising practices of platform companies. Chandrika is survived by a young college-going son, and TGPWU will also set up a fundraiser to support his educational pursuits. We call upon all other unions and workers’ federations, researchers, lawyers, activists, journalists, and writers to stand by us and extend their support to us in this struggle.

Shaik Salauddin

Founder-President

TGPWU

డిసెంబర్ 19, 2024 :

తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) సభ్యులు, వాలంటీర్లు మరియు సాథీలు వర్కర్స్‌ ఐడీలను డీయాక్టివేట్ చేయడం మరియు ఇతర అన్‌ఫెయిర్ ప్రాక్టీసులను ఎదుర్కొనడానికి పోరాడటానికి సంకల్పించారు. ఈ సంకల్పం నవంబర్ 15, 2024 న Urban Company వర్కర్ అయిన చంద్రికా మృతి చెందిన సందర్భంలో జరిగిన స్మారక సమావేశంలో తీసుకోబడింది. చంద్రికా, అనేక ఆరోగ్య సమస్యలు కలిగించిన ఒత్తిడి కారణంగా మరణించిందని అనుమానించబడింది. ఈ సమావేశం చంద్రికా ను ఓ స్ఫూర్తిగా  స్మరించింది, ఆమె Urban Companyలో తమ ఐడీలను అనవసరంగా బ్లాక్ చేసినందు వలన బాధపడుతున్న ఇతర వర్కర్స్ కోసం తన పోరాటం నడిపింది.  ప్లాట్‌ఫాం ప్రతినిధుల పోలీసుల వేధింపులను ఎదుర్కొని పోరాడిన ఆమె ధృఢ సంకల్పం, కేవలం Urban Company వర్కర్స్ కాకుండా, ఇండియాలో గిగ్ మరియు ప్లాట్‌ఫాం వ్యవస్థతో మరియుపోరాడుతున్న  వర్కర్స్ కి ప్రేరణగా నిలుస్తుంది. TGPWU చంద్రికా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు ప్లాట్‌ఫాం కంపెనీల అన్యాయ ప్రవర్తనల వల్ల అణగిపోయిన మన సహ కార్మికులకు న్యాయం కల్పించడానికి నిరంతరం కట్టుబడి ఉంది. చంద్రిక కొడుకు విద్యకు మద్దతు ఇవ్వడానికి ఒక ఫండరైజర్ ఏర్పాటు చేయనుంది. మేము అన్ని యూనియన్లు, కార్మికుల సంఘాలు, పరిశోధకులు, న్యాయవాదులు, కార్యకర్తలు, పత్రికా ప్రతినిధులు మరియు రచయితలను మా పోరాటంలో మాతో కలిసి ఉండాలని, మాకు మద్దతు ఇవ్వాలని ఆహ్వానిస్తున్నాము.

షేక్  సలావుద్దీన్ 

సంస్థాపక – అధ్యక్షులు 

TGPWU

,